సచివాలయంలో ఆక్టోపస్ మాక్‌డ్రిల్‌

తెలంగాణ సచివాలయంలో భద్రతా సన్నద్ధతను పరీక్షించేందుకు ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.
Telangana Secretariat in Hyderabad
తెలంగాణ సచివాలయం
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : డా.బీఆర్​ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర​ సచివాలయంలో భద్రతా సన్నద్ధతను పరీక్షించేందుకు ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఆపరేషనల్ మాక్‌ డ్రిల్ నిర్వహించింది. అనుకోని భద్రతా ముప్పులు, అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమర్థంగా ఎదుర్కొనేందుకు వివిధ విభాగాల సన్నద్ధత, పరస్పర సమన్వయం, సామర్థ్యాలను పరీక్షించారు. ఆక్టోపస్, పోలీస్, ఫైర్, సెక్రటేరియట్ ప్రొటెక్షన్​ ఫోర్స్, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ట్రాఫిక్ పోలీస్, మెడికల్ టీం, బాంబ్ డిస్పోజల్ బృందాలకు చెందిన 130 మంది సిబ్బంది డ్రిల్​లో పాల్గొన్నారు. సచివాలయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ బృందం ఇలాంటి మాక్‌డ్రిల్స్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ, అసాల్ట్ కమాండర్ రఘునందన్​రావు పేర్కొన్నారు.