ఖమ్మం-దేవరపల్లి హైవేపై ఘోర ప్రమాదం.. డ్రైవర్‌ మృతి

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై గ్రానైట్‌ రాళ్లతో వెళ్తున్న కంటైనర్‌ మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందాడు.
Granite-loaded container lorry accident on Khammam-Devarapalli Greenfield Highway
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై గ్రానైట్‌ రాళ్లతో వెళ్తున్న కంటైనర్‌ మరో లారీని ఢీకొట్టింది
Published on: 

ప్రభాత ఉదయం, వైరా : ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్ నుంచి కాకినాడ వైపు గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి ముందు ప్రయాణిస్తున్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కంటైనర్‌లోని గ్రానైట్‌ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో డ్రైవర్‌ షేక్‌ అనికుల్‌ (29) క్యాబిన్‌లోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, బీర్భూమ్ జిల్లా, ఖిదిర్‌పూర్ గ్రామానికి చెందిన మస్రుల్ ఇస్లాం కుమారుడిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్ఐలు పుష్పాల రామారావు, పవన్ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్రానైట్ రాళ్లు హైవేపై పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు వాహనాలను జాతీయ రహదారివైపు మళ్లించారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.