ఆదివాసులను ఏకం చేసిన వీరుడు.. కుంరం సూరు 29వ వర్ధంతి, కొలాంగూడలో ఘనంగా ఏర్పాట్లు

కుమ్రం భీమ్ అనుచరుడు, గిరిజన హక్కుల పోరాట యోధుడు కుంరం సూరు 29వ వర్ధంతిని ఉట్నూరు మండలం కొలాంగూడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Kumram Suru
కుంరం సూరు
Published on: 

ప్రభాత ఉదయం, ఉట్నూరు : గిరిజన పోరాట యోధుడు కుమ్రం భీమ్ అనుచరుడు కుంరం సూరు వర్థంతిని గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూరు 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఉట్నూరు మండలంలోని కొలాంగూడ గ్రామంలో కమిటీ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.  

నిస్సహాయులకు అండగా

కెరమరి మండలం జోడేఘాట్ గ్రామంలో కుంరం చిన్ను, మారుబాయిల దంపతులకు 1918లో సూరు జన్మించారు. చిన్నతనం నుంచి అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకునే వారు. గోండ్, కొలాం జాతి ప్రజల  వెనుకబాటుకు నైజాం ప్రభుత్వాన్ని కారణమని గ్రహించి ఆదివాసులను ఏకం చేసి హక్కుల సాధన కోసం నిజాంతో పోరాటానికి సిద్ధమయ్యారు సూరు. కొలం, గోండులను ఏకం చేసి కుంర్ భీంకు అండగా నిలిచారు. ఈ క్రమంలో  జోడేఘాట్ పరిస గ్రామాల భూములను నిజాం రజాకార్లు ఆక్రమించి ఆదివాసులపై దాడులు చేసేవారు.

భీం​తో కలిసి ఉద్యమం..

కుమ్రం భీమ్ అనుచరుడిగా, పోరాట వ్యూహకర్తగా సూరు వ్యహరించారు. నిజాం రాజుకు తన డిమాండ్లను తెలపడానికి భీమ్ తో కలిసి, కాలినడకన హైదరాబాదుకు వెళ్లారు. ఈ క్రమంలో 1940 అక్టోబరులో జోడేఘాట్‌ గుట్టల్లో నిజాం సైనికులు దాడిచేయగా భీమ్ మరణించారు. సూరు కుడిచేయి, కుడి కాలుకు, నడుముకు తూటాలు తగిలాయి. కొన్నాళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపిన తరువాత సూరు మరణించారు. సూరుతో పాటు వెడ్మ రాము కూడా పోరాటంలో పాల్గొన్నారు. కొలాం సంప్రదాయం ప్రకారం భీమ్ వర్ధంతి తర్వాత సూరు వర్ధంతిని నిర్వహిస్తూ వస్తున్నారు.