

వర్ధన్నపేట, ప్రభాత ఉదయం: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహడ్‌లో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. మంగళవారం పీఏసీఎస్ చైర్మన్‌గా పొలం అనిల్‌రెడ్డితోపాటు 12 మంది డైరెక్టర్లు ప్రమాణం చేశారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారని కాంగ్రెస్ నాయకులు, మాజీ పాలక మండలి సభ్యులు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ఫిర్యాదు చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.