రాజీవ్‌ రహదారిపై ప్రమాదం.. యువకుడు దుర్మరణం

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీర్ల సదానందం (36) ప్రాణాలు కోల్పోయాడు.
Road accident
Veerla Sadanandam lost his life while crossing Road on the Rajiv Highway at Alugunoor
Published on: 

ప్రభాత ఉదయం, మానకొండూర్: రాజీవ్‌ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌కు చెందిన వీర్ల సదానందం (36) బుధవారం ఉదయం అలుగునూర్‌ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టడంతో సదానందం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అనిల్‌ తెలిపారు. సదానందం మృతితో కుటుంబ సభ్యులు, మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.