ఇద్దరు పిల్లలను చంపి.. తల్లీ ఆత్మహత్య

ధరూర్ మండలం చింతకుంటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Vikarabad mother and two children death
Published on: 

ప్రభాత ఉదయం, వికారాబాద్ : వికారాబాద్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధరూర్‌ మండలం చింతకుంట గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను హతమార్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చింత‌కుంట గ్రామానికి చెందిన భూపతిరెడ్డి, వాస‌వీరెడ్డి (35) భార్యాభర్తలు. వీరికి సాయి (7), లక్కీ (4) కుమారులు. భూపతిరెడ్డి తాండూరులో ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేస్తుండగా వాసవీరెడ్డి ఓ స్కూల్‌లో టీచర్ గా పనిచేస్తోంది. వీరంతా వికారాబాద్ జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వాసవీరెడ్డి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇటీవల చింతకుంటకు తీసుకెళ్లగా పిల్లలతో కలిసి అక్కడే ఉంటోంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కొడుకులకు ఉరి వేసి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహిళ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకొని ఉంటుందని కుటుంబసభ్యులు, గ్రామ‌స్తులు అనుమానిస్తున్నారు.