

ప్రభాత ఉదయం, వనపర్తి: సాధారణంగా ఈ సమయంలో తక్కువగా ఉండాల్సిన కూరగాయల ధరలు.. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో భగ్గుమంటున్నాయి. వనపర్తి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రేట్లు పెరిగాయి. ఏది కొనాలన్నా కొనలేని పరిస్థితి. ప్రకృతి ప్రకోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి.. సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి. జిల్లాలో ప్రధానంగా వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో కూరగాయల విక్రయాలు జోరుగా సాగుతాయి. ఇక్కడి వ్యాపారులు కర్నూల్, నంద్యాల, బెంగళూరు, హైదరాబాద్, షాద్‌నగర్, అనంతపురం జిల్లాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటారు. మిగతా మండలాల్లో వార సంతలు జరుగుతాయి. మండల, గ్రామస్థాయిలో సంతలకు స్థానిక రైతులూ కూరగాయలు తెచ్చి విక్రయిస్తారు. అయితే, ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో బావులు ఒట్టిపోతున్నాయి. బోరు బావుల నుంచి దారపు పోగులా వస్తున్న నీరు రైతులను ఆందోళన కలిగిస్తుంది. అక్కడక్కడ కొద్దిమేర సాగు చేసిన కూరగాయల తోటలు ఎండిపోవడంతో జీవనోపాధి పొందే రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. అటు కూరగాయలు పండక ఉపాధి కోల్పోతున్న రైతులు, ఇటు పెరిగిన ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
వనపర్తిలో కూరగాయల రేట్లు(కిలో) ఇలా..
పచ్చిమిర్చి రూ.100
క్యారెట్ రూ.80
క్యాప్సికం రూ.80
చిక్కుడు రూ.80
వంకాయ రూ.60
బీట్రూట్ రూ.60
కాకర కాయ రూ.60
క్యాలీఫ్లవర్ రూ.60
గోరుచిక్కుడు రూ.60