ప్రియుడి మోజులో.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది.
ప్రియుడి మోజులో.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
Published on: 

ప్రభాత ఉదయం, జయశంకర్ భూపాలపల్లి : ప్రియుడిపై మోజుతో కట్టుకున్నోడినే భార్య కడతేర్చింది. ప్రియుడితో కలిసి భర్తను గొడ్డలితో హతమార్చి పక్క ఊరిలో పడేసిన దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. డీఎస్పీ సంపత్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం తండాకు చెందిన అజ్మీర చందు (30), భార్య పావని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అదే తండాకు చెందిన ధరావత్ సంతోష్, పావని మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో చందును హతమార్చాలని పావని, ఆమె ప్రియుడు పథకం పన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పావని, సంతోష్ కలిసి ఇంట్లోనే చందును గొడ్డలితో మెడపై నరికి హతమార్చారు. మృతదేహాన్ని ఎడ్ల బండిపై తీసుకొని పక్కనే ఉన్న చికెనేపల్లి గ్రామ శివారులోని పొదల్లో పడవేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చంపినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చికెనేపల్లి గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ సంపత్ రావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.