‘అలిగిన బతుకమ్మ’ వేడుకలు.. సంప్రదాయానికి విరుద్ధంగా నిర్వహణ!

బతుకమ్మ పండుగలో ఆరో రోజున బతుకమ్మను పేర్చకుండా, నైవేద్యం సమర్పించకుండా ఉండటం సంప్రదాయం. అయితే యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో ఇందుకు భిన్నంగా ‘అలిగిన బతుకమ్మ’ వేడుకలు నిర్వహించారు.
కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగులు
కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగులు
Published on: 

ప్రభాత ఉదయం, యాదాద్రి భువనగిరి: బతుకమ్మ పండుగలో ఆరో రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆ రోజున బతుకమ్మను పేర్చకుండా, నైవేద్యం సమర్పించకుండా ఉండటం సంప్రదాయం. అయితే యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో ఇందుకు భిన్నంగా ‘అలిగిన బతుకమ్మ’ వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 10న అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. సంప్రదాయం ప్రకారం ఆ రోజు బతుకమ్మను పేర్చరు, నైవేద్యం సమర్పించరు. అయితే కలెక్టరేట్‌లో మాత్రం బతుకమ్మను పేర్చి, నైవేద్యం సమర్పించారు. దీంతో సంప్రదాయానికి భిన్నంగా వేడుకలు నిర్వహించడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది.

 టాంగాలో కలెక్టరేట్‌కు తీసుకువచ్చిన భారీ బతుకమ్మ
టాంగాలో కలెక్టరేట్‌కు తీసుకువచ్చిన భారీ బతుకమ్మ