

ప్రభాత ఉదయం, నర్సాపూర్: ఆర్థిక ఇబ్బందులతో యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు(36) వ్యవసాయ పనుల నిమిత్తం అప్పులు చేసి ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక స్థానిక నీళ్ల ట్యాంక్ వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు.