జహీరాబాద్‌ ఏవో లావణ్యకు జాతీయ అవార్డు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ అధికారి నీరడి లావణ్యకు జాతీయ అవార్డు లభించింది. రైతులకు అవగాహన కల్పించడం, ఆధునిక సాగును ప్రోత్సహించడంలో ఆమె కృషికి గుర్తింపు దక్కింది.
Neeradi Lavanya receives national award
Zaheerabad Agricultural Officer Neeradi Lavanya Receives National Award
Published on: 

ప్రభాత ఉదయం, జహీరాబాద్:  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల వ్యవసాయశాఖ అధికారి నీరడి లావణ్యకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ మహిళా కిసాన్ దివస్ సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె జాతీయ అవార్డును అందుకున్నారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు మహేందర్ కుమార్ త్రివేది, ఆతీశ్ చంద్ర ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఏటా అక్టోబరు 15న ఇచ్చే ఈ పురస్కారానికి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం తరఫున లావణ్య ఎంపికయ్యారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలపై రైతులకు అవగాహన కల్పించడం, ఆధునిక సాగు పద్ధతులను అనుసరించేలా ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ డివిజన్ అధికారులు, రైతులు లావణ్యను అభినందించారు.